Skip Navigation

DVD Ilustrado Multilíngue

The Biology of Prenatal Development




గర్భస్థ శిశువికాస జీవ విజ్ఞానము

.తెల [Telugu]


 

Baixar Versão em PDF  O Que é PDF?
 

Capítulo 1   Introdução

ఏ గతిశీల ప్రక్రియతో ఏక కణ నిర్మితమైన మానవ జైగోట్ నూరు వేల లక్షల కణాలతో కూడిన వయోజన వ్యక్తిగా మారుతుందో బహుశా అది ప్రకృతిలో కెల్లా అత్యంత గొప్ప అద్భుతం కావచ్చు.

ఈనాడు పరిశోధకులకు తెలిసిన విషయం ఏమంటే ఎదిగిన మానవ శరీరం నిర్వహించే అనేక సాధారణ కార్యాలు గర్భములో ఉన్నప్పుడే నిర్ధారించబడతాయి - తరచుగా పుట్టుటకు ఎంతో ముందుగానే.

జననానికి ముందు శిశువు పెరుగుదల దశను మనిషి జన్మించిన తరువాత జీవించడానికి అవసరమమైన ఎన్నో శరీర ఆకృతులు మరియు అలవాట్లు మరెన్నో నైపుణ్యాలు సముపార్జించేందుకు సిద్దంచేసే దశగా ఈ రోజు మరింతగా విశదమైంది.

Capítulo 2   Terminologia

మానవులలో సాధారణంగా గర్భస్థ కాలం సుమారు 38 వారాలుగా ఫలదీకరణం సమయం నుండి గాని, గర్భం ధరించినప్పటి నుండి గాని, పుట్టుక వరకు లెక్కించబడుతుంది.

ఫలదీకరణ నుండి మొదటి 8 వారాలు, ఎదుగుతున్న శిశువును పిండము అంటారు, అనగా "తనలో తాను పెరుగుట". పిండదశ అని పిలువబడే ఈ కాలం ప్రత్యేకత ఏమనగా శరీరంలోని పెద్ద వ్యవస్థలు చాలా వరకు ఇక్కడే రూపుదిద్దుకుంటాయి.

8వారాల నుండి గర్భస్థదశ చివరి వరకు "అభివృద్ధి చెందుతున్న మానవున్ని పిండము అంటారు", అంటే "ఇంకా జన్మించని సంతానం". పిండదశ అని పిలువబడే ఈ కాలంలో శరీరం మరింత పెద్దగా పెరుగుతుంది మరియు దాని వ్యవస్థలు పనిచేయడం ప్రారంభిస్తాయి.

ఈ ప్రోగ్రాములో వివరించిన అన్ని తొలిపిండ మరియు పిండ వయస్సులు ఫలదీకరణం సమయంనుండి లెక్కించిన కాలాన్ని సూచిస్తాయి.