Skip Navigation

DVD Ilustrado Multilíngue

The Biology of Prenatal Development




గర్భస్థ శిశువికాస జీవ విజ్ఞానము

.తెల [Telugu]


 

Baixar Versão em PDF  O Que é PDF?
 

Um Embrião de 8 Semanas

Capítulo 30   8 Semanas: Desenvolvimento do Cérebro

8 వారాలకు మెదడు బాగా అభివృద్ధి చెంది పిండం మొత్తం శరీరంలో దాదాపు సగం బరువు కలిగి ఉంటుంది.

అసాధారణ వేగంతో అభివృద్ధి కొనసాగుతుంది.

Capítulo 31   Característica de Destro e Canhoto

8 వారాలకు 75% పిండాలు కుడి చేతి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తాయి. మిగిలిన వాటిలో ఎడమ చేతి ఆధిపత్యము మరియు ఏవైపు మొగ్గు చూపని పిండాలు సరి సమానంగా ఉంటాయి. కుడి లేదా ఎడమ చేతి ఆధిపత్యపు తొలి ప్రవర్తన ఆనవాళ్ళు ఇక్కడే కనిపిస్తాయి.

Capítulo 32   Virar

శిశు వైధ్య శాస్త్ర పాఠ్య పుస్తకాలు "బోర్లా పడటం" జననం తరువాత 10 నుండి 20 వారాలకు జరుగుతుంది అని వివరిస్తాయి. అయితే ఆసక్తికరమైన ఈ సమన్వయం అల్ప భూమ్యాకర్షణ వాతావరణం గల ద్రవంతో నిండిన అమ్నియాటిక్ సంచిలో ఎంతో ముందుగానే ప్రదర్శితమవుతుంది. అధిక భూమ్యాకర్షణను ఎదుర్కొని దొర్లడానికి అవసరమైన శక్తి లేక పోవడంవల్లే గర్భాశయం బయట శిశువు వెంటనే బోర్లా తిరగ లేక పోతుంది.

పిండం శారీరకంగా మరింత చురుకుగా తయారవడం ఈ దశలో జరుగుతుంది.

కదలికలు నెమ్మది లేదా వేగంగా ఒక సారి లేదా పదే పదే స్వచ్ఛంద లేదా ప్రతిస్పందనాత్మకంగా ఉండవచ్చు.

తల తిప్పడం, మెడ సాచడం మరియు చేతులు ముఖానికి తగలడం చాలా తరచుగా జరుగుతాయి.

తాకడం వల్ల ఓరగా చూడడం, దవడలు కదలడం పట్టుకోవాలన్నట్లు కదలికలు, బొటనవేలు పైకి లేపడం లాంటి ప్రతిస్పందనలను పిండం ప్రదర్శిస్తుంది.

Capítulo 33   Fusão da Pálpebra

7 నుండి 8 వారాల మధ్య పై మరియు క్రింది కనురెప్పలు కళ్ళ ఉపరిభాగంపై వేగంగా పెరుగుతాయి మరియు పాక్షికంగా ఒక దానికొకటి అతుక్కుని ఉంటాయి.

Capítulo 34   Movimento de Respiração e Micção

గర్భాశయంలో గాలి ఉండక పోయినప్పటికి పిండం మధ్య మధ్యలో శ్వాస తీసుకుంటున్న కదలికలను 8 వారాల నుండి ప్రదర్శిస్తుంది.

ఈ సమయానికి మూత్రపిండాలు మూత్రాన్ని ఉత్పత్తి చేస్తే అది అమ్నియోటిక్ ద్రవంలోనికి విడుదల అవుతుంది.

మగ పిండాలలో, అభివృద్ధి చెందుతున్న వృషణాలు టెస్టోస్టెరోన్ ఉత్పత్తి మరియు విడుదల ప్రారంభిస్తాయి.

Capítulo 35   8 a 9 Meses (32 a 36 Semanas): Formação dos Alvéolos, Segurar com Força, Preferências de Gosto

ఎముకలు, కీళ్ళు, కండరాలు, నరాలు మరియు అవయవాలలోని రక్త నాళాలు చాలా వరకు పెద్ద వాళ్ళలో ఉన్నలాగానే అనిపిస్తాయి.

8 వారాలకు ఎపిడెర్మిన్ లేదా బాహ్య చర్మము బహుపొరలతో కూడిన చర్మంగా తయారవడం, చాలా వరకు తన పారదర్శక లక్షణాన్ని కోల్పోవడం జరుగుతుంది.

నోటి చుట్టు వెంట్రుకలు కనిపించడంతో పాటే కనురెప్పలు పెరుగుతాయి.

Capítulo 36   Resumo das Primeiras 8 Semanas

8 వారాల ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడికి పిండ దశ ముగుస్తుంది.

ఈ కాలంలో మానవ పిండం ప్రారంభ ఏక కణ దశ నుండి దాదాపు 1 బిలియను కణాలకు పెరిగి 4000 లకు పైగా విలక్షణ శరీర నిర్మాణాలను రూపొందించుకుంటుంది.

ఇప్పుడు పిండం పెద్దలలో ఉండే శరీర నిర్మాణాలలో 90% పైగా కలిగి ఉంటుంది.