| |
Capítulo 40 3 a 4 Meses (12 a 16 Semanas): Papilas Gustativas, Movimento de Mandíbula, Reflexo de Sucção, Percepção dos Primeiros Movimentos do Feto
|
| |
| 11 మరియు 12 వారాల మధ్య
పిండం బరువు దగ్గర దగ్గర 60% పెరుగుతుంది.
12 వారాలకు గర్భ దశలోని మూడువంతులలో మొదటి వంతు
లేదా ట్రైమెస్టర్ పూర్తి అవుతుంది.
|
| వేరువేరు స్వాద గ్రంధులు
ఇప్పుడు నోటిలోపలి భాగాన్ని ఆవరిస్తాయి.
|
| జననం నాటికి, స్వాద గ్రంధులు
కేవలం నాలుక మరియు నోటి పై భాగంలో ఉంటాయి.
|
| మల విసర్జన ఎంతో ముందుగా 12 వారాలకే ప్రారంభం అయి
సుమారు 6 వారాలు కొనసాగుతుంది.
గర్భస్థ పిండం మరియు కొత్తగా ఏర్పడిన పెద్ద పేగులు
తొలుత విసర్జించిన పదార్ధాలను
మెకోనియమ్ అని పిలుస్తారు.
ఇది
జీర్ణ ఎంజైములు, మాంసకృత్తులు
మరియు జీర్ణవాహిక వదిలిన
మృత కణాలతో కూడి ఉంటుంది.
|
| 12 వారాలకు
శరీర ఊర్ధ్వ భాగం పొడవు
మొత్తం శరీర పొడవు అనుపాతంతో
పోల్చితే ఆఖరి దశకు చేరుకుంటుంది.
శరీర క్రింది భాగం పొడవు శరీర అనుపాతంలో పూర్తిస్థాయికి
చేరుకోవడానికి ఎక్కువ కాలం తీసుకుంటుంది.
|
| శరీరవెనుక మరియు తలపై భాగాలు తప్ప
గర్భస్థ శిశువు యొక్క మొత్తం శరీరం ఇప్పుడు స్వల్ప స్పర్శకు ప్రతిస్పందిస్తుంది.
|
| లింగ ఆధారిత అభివృద్ధి భేదాలు
మొదటి సారిగా కనిపిస్తాయి.
ఉదాహరణకు ఆడ గర్భస్థ శిశువు దవడల కదలికలను
మగ శిశువు కంటే ఎక్కువగా ప్రదర్శిస్తుంది.
|
| ఇంతకు ముందు చూసినట్లు నోటి దగ్గర ప్రేరణ జరిగితే
వెనుక్కు ముడుచుకునే ప్రతిస్పందనకు భిన్నంగా
ప్రేరేపించిన వస్తువు వైపు మళ్ళడం మరియు
నోరు తెరవడం ద్వారా ప్రతిస్పందనలుంటాయి..
ఈ ప్రతిస్పందనను "రూటింగ్ రెస్పాన్స్" అంటారు.
ఇది జననం తరువాత కూడా కొనసాగుతుంది,
నవజాత శిశువు పాలు త్రాగే సమయంలో
తల్లి చనుమొనలను
వెతుక్కోవడానికి ఉపయోగపడుతుంది.
|
| ముఖాకృతి
బుగ్గల భాగంలో కొవ్వు చేరడం ప్రారంభం అవడంతో
పరిణితి చెందుతుంటుంది.
మరియు దంతాల అభివృద్ధి ప్రారంభమవుతుంది.
|
| 15 వారాలకు, రక్తాన్ని ఉత్పత్తిచేసే మూలకణాలు బయలుదేరి
ఎముకలలోని మజ్జలో వృద్ది చెందుతాయి.
అత్యధిక రక్త కణాల నిర్మాణం ఇక్కడే జరుగుతుంది.
|
| పిండ కదలికలు 6 వారాలకే ప్రారంభమయినప్పటికీ
గర్భంతో ఉన్న స్త్రీ పిండ కదలికలను
14 మరియు 18 వారాల మధ్య గమనించ గలుగుతుంది.
సాంప్రదాయకంగా ఈ సంఘటన క్వికెనింగ్ అని పిలువబడుతుంది.
|