| |
Capítulo 41 4 a 5 Meses (16 a 20 Semanas): Resposta ao Estresse, Verniz Caseoso, Ritmos Circadianos
|
| |
| 16 వారాల సమయంలో గర్భస్థ శిశువు ఉదరంలోకి
సూదిని చొప్పించే పద్ధతిని ప్రయోగిస్తే
ఒత్తిడి ప్రభావానికి స్పందించే హార్మోనుల విడుదల
ప్రక్రియ వెంటనే ప్రారంభమై
నొరాడ్రెనలైన్
లేదా నొరాపైనేఫ్రైన్ అనే హార్మోను
రక్త ప్రవాహంలోకి విడుదల అవుతుంది.
అప్పుడే పుట్టిన శిశువులు మరియు పెద్దలు ఇద్దరూ
దాడికి గురి అయిన పరిస్థితులలో ఒకే రకంగా స్పందిస్తారు.
|
| శ్వాస వ్యవస్థలో
శ్వాసనాళాల వ్యవస్థ దాదాపు పూర్తి అవుతుంది.
|
| వర్నిక్స్ కాసియోసా అనే తెల్లని రక్షణ పధార్ధం
గర్భస్థ శిశు దేహం
చుట్టూ ఆవరిస్తుంది.
చర్మానికి అమ్నియోటిక్ ద్రవం ప్రభావం వల్ల దురద,
నొప్పి లాంటి ఇర్రిటేషన్స్ రాకుండా
వర్నిక్స్ కాపాడుతుంది.
|
| 19 వారాల నుండి, పిండ కదలిక
శ్వాస పీల్చడం
మరియు గుండె కొట్టుకోవడంలో
దైనిక క్రమం ప్రారంభమవుతుంది.
దీన్ని సర్కాడియన్ రిధమ్ అంటారు.
|
Capítulo 42 6 a 7 Meses (24 a 28 Semanas): Reflexo Cócleo-Palpebral e de Sobressalto; Pupilas Respondem à Luz; Olfato e Paladar
|
| |
| 20 వారాలకు వినికిడి అవయవం
అయిన కోచ్ లియా
పూర్తిగా తయారైన
చెవి అంతర్భాగంలో
పూర్తి సైజుకు ఎదుగుతుంది.
ఇప్పటినుండి
గర్భస్థ శిశువు
పెరుగుతున్న ధ్వని తీవ్రతలకు స్పందిస్తుంది.
|
| నెత్తి చర్మంపై వెంట్రుకలు మొలవడం ప్రారంభమవుతాయి.
అన్ని చర్మ పొరలు మరియు నిర్మాణాలు
కేశ మూలాలు మరియు గ్రంధులతో సహా పూర్తి అవుతాయి.
|
| ఫలదీకరణ తరువాత 21 నుండి 22 వారాలకు
ఊపిరి తిత్తులు గాలి పీల్చుకునే కొంత సామర్ధ్యాన్ని సంపాదిస్తాయి.
ఈ సమయాన్ని జీవన క్షమతా కాలము అని భావిస్తారు.
ఎందుకంటే ఈ దశలోని కొన్ని గర్భస్థ శిశువులకు గర్భం
బయట బ్రతకగలిగే అవకాశం ఉంటుంది.
సుదీర్ఘ వైధ్య శాస్త్ర ప్రగతి
పూర్తికాలానికి ముందే జన్మించిన శిశువుల
ప్రాణాలను కాపాడ గలుగుతున్నది.
|