| |
Capítulo 43 5 a 6 Meses (20 a 24 Semanas): Responde ao Som; Cabelo e Pele; Idade de Viabilidade
|
| |
| 24 వారాలకు కనురెప్పలు తిరిగి విచ్చుకుంటాయి
మరియు కళ్ళు చికిలించి
ఉలిక్కిపడటం లాంటి క్రియలను ప్రదర్శిస్తుంది.
అకస్త్మాత్తుగా వచ్చే పెద్ద ధ్వనులకు జరిగే ఈ ప్రతిస్పందన
ముఖ్యంగా ఆడ గర్భస్థ శిశువులలో ముందుగా ప్రారంభమవుతుంది.
|
| అనేక పరిశోధనల ప్రకారం అతి పెద్ద శబ్ధాలు
గర్భస్థ శిశు ఆరోగ్యం పై చెడు ప్రభావాలను
కలుగజేయవచ్చునని తెలుపుతున్నాయి.
ఇలా అతి పెద్ద శబ్ధాలకు లోనయినప్పుడు వెంటనే జరిగే
పరిణామాలలో పెరిగిన గుండె వేగం కొనసాగడం
ఎక్కువగా ఉమ్మనీరు మ్రింగడం
మరియు అర్ధాంతర ప్రవర్తనా మార్పులు ఉంటాయి.
దీర్ఘకాలిక పరిణామాలలో, వినికిడి లోపం ఉంటుంది.
|
| గర్భస్థ శిశు శ్వాస వేగం పెరుగుదల
నిముషానికి 44 ఉఛ్చ్వాస నిశ్వాసలంత స్థాయికి పెరుగుతాయి.
|
| గర్భదశలో మూడవ త్రైమాసంలో
వేగంగా పెరిగే మెదడు గర్భస్థ
శిశువు ఉపయోగించే శక్తిలో 50% వినియోగిస్తుంది.
మెదడు బరువు 400 నుండి 500% మధ్య పెరుగుతుంది.
|
| 26 వారాలకు కళ్ళు కన్నీళ్ళను ఉత్పత్తి చేస్తాయి.
వెలుగుకు కంటి పాపలు స్పందించడం 27 వారాల
ముందుగానే జరుగుతుంది.
ఈ ప్రతిస్పందన రేటీనాకు చేరే
వెలుగు మొత్తాన్ని జీవితాంతం క్రమబద్దీకరిస్తుంది.
|
| వాసన తెలుసుకోవడానికి అవసరమైన
అన్నిభాగాలు పనిచేసే స్థితికి చేరుకుంటాయి.
నెలలు నిండక పూర్వమే పుట్టిన శిశువులపై జరిగిన
అధ్యయనాలు ఫలదీకరణం జరిగిన
26 వారాలు అంత కంటే ముందు దశలోనే
చెడువాసనలను గుర్తించే శక్తి
శిశువుకు ఉన్నట్లు తెలుపుతున్నాయి.
అమ్నియోటిక్ ద్రవంలో తీపి పదార్ధాలను ఉంచడం వల్ల
గర్భస్థ శిశువు ద్రవాలను మ్రింగడం పెరుగుతుంది.
దీనికి భిన్నంగా చేదు పదార్ధాలను చేర్చితే
గర్భస్థ శిశువు ద్రవాలను తక్కువగా మ్రింగుతుంది.
ఇలా ఉంచినప్పుడు ముఖ కవళికలు తరచూ మారుతాయి.
|
| అడుగులు వేస్తున్నట్లుగా ఉండే కదలికలు
అంటే నడువడంలాగా అనిపించే
కదలికలతో గర్భస్థ శిశువు
పిల్లి మొగ్గలు వేస్తుంది.
|
| గర్భస్థ శిశువు క్రొవ్వు కణాలు చర్మం అడుగున
చేరడంతో తక్కువ ముడుతలతో కనిపిస్తుంది.
జననం తరువాత శరీర ఉష్ణోగ్రత కాపాడేందుకు
మరియు శక్తిని నిల్వ ఉంచుకునేందుకు
క్రొవ్వు చాలా కీలక పాత్ర వహిస్తుంది.
|
Capítulo 44 7 a 8 Meses (28 a 32 Semanas): Discriminação de Sons, Estados Comportamentais
|
| |
| 28 వారాలకు గర్భస్థ శిశువు
ఎక్కువ మరియు తక్కువ ధ్వని తీక్షణతలను
గుర్తించ గలుగుతుంది.
|
| 30 వారాలకు శ్వాస కదలికలు
చాలా మామూలు అయిపోయి
సగటు శిశువులో 30 నుండి 40% సమయం ఏర్పడుతుంటాయి.
|
| గర్భ దశలో చివరి 4 నెలల కాలంలో శిశువు
సమయ సమన్వయంతో కూడిన క్రియలను ప్రదర్శిస్తూ
సమయం ప్రకారం విశ్రాంతి తీసుకుంటుంది.
ఈ ప్రవర్తనా దశలు
నిరంతరం పెరుగుతున్న
కేంద్ర నాడీ మండల సంక్లిష్టతను తెలియజేస్తాయి.
|
Capítulo 45 Os Membros e a Pele
|
| |
| సుమారు 32 వారాలకు
నిజమైన అల్వియోలి లేదా
గాలి తిత్తుల కణాలు ఊపిరితిత్తులలో
అభివృద్ధి అవడం ప్రారంభమవుతుంది.
అలా గాలి తిత్తుల నిర్మాణం
పుట్టిన తర్వాత 8 సంవత్సరాల వరకు కొనసాగుతుంది.
|
| 35 వారాలకు గర్భస్థ శిశువు చేతితో గట్టిగా పట్టుకో గలిగే స్థితికి చేరుతుంది.
|
| గర్భస్థ శిశువు వివిధ పదర్ధాలకు ఎక్స్పోజ్ అవడం
పుట్టిన తర్వాత రుచి ప్రాధాన్యతలను
ప్రభావితం చేస్తున్నట్లు అనిపిస్తుంది.
ఉదాహరణకు ఎవరి తల్లులు, లికోరైస్ కు ఆ రుచి ఇచ్చే
సోంపు తిన్నారో, ఆ గర్భస్థ శిశువులు
పుట్టిన తరువాత సోంపు అంటే ఇష్టపడుతున్నారు.
అదే గర్భంలో ఉన్నప్పుడు దానికి దూరంగా ఉన్నవారు
సోంపును ఇష్టపడటం లేదు.
|
Capítulo 46 9 Meses até o Nascimento (36 Semanas até o Nascimento)
|
| |
| గర్భస్థ పిండం పెద్ద మొత్తంలో
ఈస్ట్రోజెన్ అనే హార్మోనును విడుదల చేసి
ప్రసవనొప్పులను ప్రేరేపి స్తుంది,
ఆ విధంగా గర్భస్థ శిశువు నుండి
నవజాత శిశువుగా మార్పు ప్రారంభమవుతుంది.
ప్రసవ నొప్పుల సమయంలో
గర్భాశయం బలమైన సంకోచాలకు గురి అయి
శిశు జననం జరుగుతుంది.
|
| ఫలదీకరణం నుండి జననం వరకు మరియు ఆ తరువాత
మానవ వికాసం నిరంతర గతిశీలము మరియు సంక్లిష్టము అయి ఉంటుంది.
అద్భుతమైన పిండ అభివృద్ధి ప్రక్రియ యొక్క కీలక ప్రభావం
జీవిత కాలపు ఆరోగ్యంపై ఉంటుంది అని
నూతన పరిశోధనా ఫలితాలు మరింతగా తెలియజేస్తున్నాయి.
మానవ అభివృద్ధి ప్రారంభదశ పై మన అవగాహన పెరిగే కొద్ది
జననానికి ముందు మరియు జననం తరువాత
ఆరోగ్యాన్ని పెంచుకునే సామర్ధ్యం కూడ పెరుగుతుంది.
|