Skip Navigation

DVD Ilustrado Multilíngue

The Biology of Prenatal Development




గర్భస్థ శిశువికాస జీవ విజ్ఞానము

.తెల [Telugu]


 

Baixar Versão em PDF  O Que é PDF?
 

Desenvolvimento Embrionário: 4 a 6 Semanas

Capítulo 11   4 Semanas: Líquido Amniótico

4 వారాలకు తేటగా నున్న అమ్నియన్, ద్రవంతో నిండిన సంచిలో పిండం చుట్టూ చేరుతుంది. అమ్నియోటిక్ ఫ్లూయిడ్ అని పిలువబడే ఈ రోగాణు రహిత ద్రవం, గాయపడకుండా పిండానికి రక్షణ కల్పిస్తుంది.

Capítulo 12   O Coração em Ação

గుండె ఒక పద్ధతిలో నిముషానికి సుమారు 113 సార్లు కొట్టుకుంటుంది.

గుండె గదులలోనికి రక్తం ప్రవేశించినపుడు మరియు బయటికి వెళ్ళినపుడు గుండె రంగు ఎలామారుతుందో చూడండి.

జననానికి ముందు గుండె సుమారు 54 మిలియను మార్లు మరియు 80 సంవత్సరాల జీవిత కాలంలో 3.2 బిలియను కంటే ఎక్కువ సార్లు కొట్టుకుంటుంది.

Capítulo 13   O Crescimento do Cérebro

మెదడు వేగంగా పెరుగుతున్నట్లు ముందుభాగపు మెదడు మధ్యభాగపు మెదడు మరియు వెనుకభాగపు మెదడుల మారుతున్న రూపాల వల్ల తెలుస్తుంది.

Capítulo 14   Brotos dos Membros

ఊర్ధ్వ మరియు అధః అవయవాల అభివృద్ధి 4 వారాలకు అవి మొగ్గలలాగా బయటకు కనిపించడంతో పాటే మొదలవుతుంది.

ఈ దశలో చర్మం పారదర్శకంగా ఉంటుంది. ఎందుకంటే అది ఒక కణం మందాన్ని మాత్రమే కలిగిఉంటుంది.

చర్మం మందం పెరిగే కొద్ది అది దాని పారదర్శకతను కోల్పోతుంది. దీని అర్ధం ఏమంటే మనం అంతర్గత అవయవాల అభివృద్ధిని సుమారు ఇంకో నెల వరకు చూడవచ్చు.

Capítulo 15   5 Semanas: Hemisférios Cerebrais

4 నుండి 5 వారాల మధ్య మెదడు వేగంగా పెరగడాన్ని కొనసాగిస్తూ 5 విలక్షణ భాగాలుగా విభజించుకుంటుంది.

పిండం మొత్తం పరిమాణంలో తల 1/3 భాగం ఉంటుంది.

సెరిబ్రల్ హెమిస్పియర్లు బహిర్గతమై క్రమంగా మెదడు లోని అతిపెద్ద భాగాలుగా తయారవుతాయి..

సెరిబ్రల్ హెమిస్పియర్లు అంతిమంగా నియంత్రించే పనులలో ఆలోచన, నేర్చుకోవడం, జ్ఞాపకం, మాటలు, చూపు, వినికిడి, స్వచ్ఛంద కదలిక మరియు సమస్యా పరిష్కారము ఉంటాయి.

Capítulo 16   Vias Respiratórias Principais

శ్వాస వ్యవస్థలో కుడి మరియు ఎడమ ప్రధాన మూల శ్వాసనాళాలు ఉండి చివరకు ట్రాఛియా లేదా వాయునాళాన్ని ఊపిరితిత్తులతో కలుపుతాయి.

Capítulo 17   Fígado e Rins

కొట్టుకుంటున్న గుండె ప్రక్కనే ఉదరభాగాన్ని ఆక్రమించిన పెద్ద కాలేయాన్ని గమనించండి.

శాశ్వత మూత్రపిండాలు 5 వారాలకు కనిపిస్తాయి.

Capítulo 18   Saco Vitelino e Células Germinativas

యోక్ శాక్, జెర్మ్ సెల్స్ అని పిలువబడే తొలి పునరుత్పత్తి కణాలను కలిగి ఉంటుంది. 5 వారాలకు ఈ జెర్మ్ సెల్స్ మూత్రపిండాలకు ప్రక్కనేఉన్న పునరుత్పత్తి అవయవాలకు తరలి వెళ్ళుతాయి.

Capítulo 19   Placas da Mão e Cartilagem

అంతే కాకుండా 5 వారాలు గడిచేటప్పటికి, పిండము హ్యండ్ ప్లేట్లను అభివృద్ధి చేస్తుంది మరియు 5 1/2 వారాలకు తరుణాస్థిక నిర్మాణం ప్రారంభమవుతుంది.

ఇక్కడ మనం ఎడమచేయి ప్రారంభ రూపాన్ని మరియు మణికట్టును 5 వారాల 6 రోజులకు చూడగలం.