| |
Desenvolvimento Embrionário: 6 a 8 Semanas
Capítulo 20 6 Semanas: Movimento e Sensação
|
| |
| 6 వారాలకు సెరిబ్రల్ హెమిస్పియర్ లు మిగతా మెదడు భాగాల
పెరుగుదల అనుపాతానికి భిన్నంగా
ఎంతో వేగంగా పెరుగుతుంటాయి.
పిండము స్వచ్చంద మరియు
ప్రతిస్పందనాత్మక కదలికలను ప్రారంభిస్తుంది.
అలాంటి కదలికలు
నాడులు కండరాల సాధారణ పెరుగుదలకు అవసరం.
|
| నోటి భాగం దగ్గర కలిగిన స్పర్శ
పిండం ప్రతిస్పందనాత్మకంగా తలను వెనక్కు తీసుకునేలా చేస్తుంది.
|
Capítulo 21 A Orelha Externa e a Formação de Célula Sanguínea
|
| |
| చెవి బాహ్య భాగము రూపు సంతరించుకోవడం ప్రారంభిస్తుంది.
|
| 6 వారాలకు,
ప్రస్తుతం లింఫోసైట్లు ఉన్న కాలేయంలో
రక్త కణాల నిర్మాణం కొనసాగుతుంటుంది.
ఈ రకపు తెల్ల రక్త కణం
అభివృద్ధి చెందే రోగ రక్షణ వ్యవస్థకు కీలక భాగం.
|
Capítulo 22 O Diafragma e os Intestinos
|
| డయాఫారమ్,
అంటే ఊపిరి పీల్చుకోవడానికి ఉపయోగించే
ప్రధాన కండరం,
చాలా వరకు 6 వారాలకు రూపొందుతుంది.
|
| పేగులలోని ఒక భాగము తాత్కాలికంగా
బొడ్డు నాళంలోకి చొచ్చుకొని వస్తుంది.
ఫిజియో లాజిక్ హెర్నియేషన్ అని పిలువబడే ఈ సాధారణ ప్రక్రియ
అభివృద్ధి చెందే ఇతర అవయవాలకు ఉదరంలోపల స్థానాన్ని కల్పిస్తుంది.
|
Capítulo 23 Placas da Mão e Ondas Cerebrais
|
| |
| 6 వారాలకు హ్యాండ్ ప్లేట్స్ ఒక సూక్ష్మ బల్ల పరుపుతనాన్ని
పొందుతాయి.
|
| 6 వారాల 2 రోజులు అంత తొలిదశలోనే మెదడు తరంగాలు రికార్డు చేయబడ్డాయి.
|
Capítulo 24 Formação do Mamilo
|
| |
| ఛాతీ యందు గల తమ ఆఖరు స్థానాన్ని
చేరుకోవడానికి కొంచెం ముందు రొమ్ము ప్రక్క భాగాలలో
చనుమొనలు కనిపిస్తాయి.
|
Capítulo 25 Desenvolvimento dos Membros
|
| |
| 6 1/2 వారాలకు మోచేతులు గుర్తించదగినట్లుగా మారి
వ్రేళ్ళు విడిపోవడం ప్రారంభమవుతుంది,
మరియు చేతుల కదలికలు చూడవచ్చు.
|
| ఒస్సిఫికేషన్ అని పిలువబడే ఎముకల నిర్మాణం
క్లావికల్ లేదా
కాలర్ బోన్ మరియు
క్రింది, పై దవడ ఎముకలలో ప్రారంభమవుతుంది.
|
Capítulo 26 7 Semanas: Soluços e Resposta a Susto
|
| |
| 7 వారాలకు ఎక్కిళ్ళు గమనించబడ్డాయి.
ఉలిక్కిపడడంతో పాటు
కాళ్ళు కదలడం కనిపిస్తుంది.
|
Capítulo 27 O Coração Desenvolvido
|
| |
| 4 గదుల గుండె దాదాపు పూర్తి అవుతుంది.
ఈ దశలో సగటున గుండె నిముషానికి 167 సార్లు కొట్టుకుంటుంది.
7 1/2 వారాలకు రికార్డు చేయబడిన గుండె విధ్యుత్ తరంగ క్రియ
పెద్దవారిలో ఉండే తరంగ క్రియ మాదిరిగానే
ఉన్నట్లు తెలుపుతుంది .
|
Capítulo 28 Ovários e Olhos
|
| |
| ఆడ గర్భస్థ పిండాలలో అండాశయాలు 7 వారాలకు గుర్తించబడ గలుగుతాయి.
|
| 7 1/2 వారాలకు,
రంగు కలిగిన కంటి రెటీనా
సులభంగా కనిపిస్తుంది మరియు కంటి రెప్పలు
వేగంగా పెరగడం ప్రారంభిస్తాయి.
|
Capítulo 29 Dedos das Mãos e dos Pés
|
| |
| చేతివ్రేళ్ళు విడిపోయి ఉంటాయి.
కాలివ్రేళ్ళు కేవలం మూలం దగ్గరే కలసి ఉంటాయి
|
| చేతులు ఇప్పుడు
కాళ్ళలాగే దగ్గరకు రాగలవు
మోకాళ్ళ కీళ్ళు కూడా కనిపిస్తాయి.
|