| |
Um Embrião de 8 Semanas
Capítulo 30 8 Semanas: Desenvolvimento do Cérebro
|
| |
| 8 వారాలకు మెదడు బాగా అభివృద్ధి చెంది
పిండం మొత్తం శరీరంలో దాదాపు సగం బరువు కలిగి ఉంటుంది.
అసాధారణ వేగంతో అభివృద్ధి కొనసాగుతుంది.
|
Capítulo 31 Característica de Destro e Canhoto
|
| |
| 8 వారాలకు 75% పిండాలు
కుడి చేతి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తాయి.
మిగిలిన వాటిలో ఎడమ చేతి ఆధిపత్యము మరియు
ఏవైపు మొగ్గు చూపని పిండాలు సరి సమానంగా ఉంటాయి.
కుడి లేదా ఎడమ చేతి ఆధిపత్యపు తొలి ప్రవర్తన ఆనవాళ్ళు
ఇక్కడే కనిపిస్తాయి.
|
Capítulo 32 Virar
|
| |
| శిశు వైధ్య శాస్త్ర పాఠ్య పుస్తకాలు "బోర్లా పడటం"
జననం తరువాత 10 నుండి 20 వారాలకు జరుగుతుంది అని వివరిస్తాయి.
అయితే ఆసక్తికరమైన ఈ సమన్వయం
అల్ప భూమ్యాకర్షణ వాతావరణం గల ద్రవంతో నిండిన
అమ్నియాటిక్ సంచిలో ఎంతో ముందుగానే ప్రదర్శితమవుతుంది.
అధిక భూమ్యాకర్షణను ఎదుర్కొని
దొర్లడానికి అవసరమైన శక్తి లేక పోవడంవల్లే
గర్భాశయం బయట శిశువు
వెంటనే బోర్లా తిరగ లేక పోతుంది.
|
| పిండం శారీరకంగా మరింత చురుకుగా తయారవడం
ఈ దశలో జరుగుతుంది.
కదలికలు నెమ్మది లేదా వేగంగా
ఒక సారి లేదా పదే పదే
స్వచ్ఛంద లేదా ప్రతిస్పందనాత్మకంగా ఉండవచ్చు.
తల తిప్పడం, మెడ సాచడం మరియు చేతులు
ముఖానికి తగలడం
చాలా తరచుగా జరుగుతాయి.
|
| తాకడం వల్ల ఓరగా చూడడం,
దవడలు కదలడం
పట్టుకోవాలన్నట్లు కదలికలు,
బొటనవేలు పైకి లేపడం లాంటి
ప్రతిస్పందనలను పిండం ప్రదర్శిస్తుంది.
|
Capítulo 33 Fusão da Pálpebra
|
| |
| 7 నుండి 8 వారాల మధ్య
పై మరియు క్రింది కనురెప్పలు
కళ్ళ ఉపరిభాగంపై వేగంగా పెరుగుతాయి మరియు
పాక్షికంగా ఒక దానికొకటి అతుక్కుని ఉంటాయి.
|
Capítulo 34 Movimento de Respiração e Micção
|
| |
| గర్భాశయంలో గాలి ఉండక పోయినప్పటికి
పిండం మధ్య మధ్యలో శ్వాస తీసుకుంటున్న
కదలికలను 8 వారాల నుండి ప్రదర్శిస్తుంది.
|
| ఈ సమయానికి మూత్రపిండాలు మూత్రాన్ని ఉత్పత్తి చేస్తే
అది అమ్నియోటిక్ ద్రవంలోనికి విడుదల అవుతుంది.
మగ పిండాలలో, అభివృద్ధి చెందుతున్న వృషణాలు
టెస్టోస్టెరోన్ ఉత్పత్తి మరియు విడుదల ప్రారంభిస్తాయి.
|
Capítulo 35 8 a 9 Meses (32 a 36 Semanas): Formação dos Alvéolos, Segurar com Força, Preferências de Gosto
|
| |
| ఎముకలు, కీళ్ళు, కండరాలు, నరాలు
మరియు అవయవాలలోని రక్త నాళాలు
చాలా వరకు పెద్ద వాళ్ళలో ఉన్నలాగానే అనిపిస్తాయి.
8 వారాలకు ఎపిడెర్మిన్ లేదా బాహ్య చర్మము
బహుపొరలతో కూడిన చర్మంగా తయారవడం,
చాలా వరకు తన పారదర్శక లక్షణాన్ని కోల్పోవడం జరుగుతుంది.
నోటి చుట్టు వెంట్రుకలు కనిపించడంతో
పాటే కనురెప్పలు పెరుగుతాయి.
|
Capítulo 36 Resumo das Primeiras 8 Semanas
|
| |
| 8 వారాల ప్రత్యేకత ఏమిటంటే
ఇక్కడికి పిండ దశ ముగుస్తుంది.
ఈ కాలంలో మానవ పిండం
ప్రారంభ ఏక కణ దశ నుండి
దాదాపు 1 బిలియను కణాలకు పెరిగి
4000 లకు పైగా విలక్షణ శరీర నిర్మాణాలను రూపొందించుకుంటుంది.
ఇప్పుడు పిండం పెద్దలలో ఉండే
శరీర నిర్మాణాలలో 90% పైగా కలిగి ఉంటుంది.
|